telugu updates 

జీఎస్టీ-జీఎస్టీ-జీఎస్టీ

వ‌స్తు,సేవ‌ల‌పై విధించే గ‌మ్య ఆధారిత ప‌న్ను జీఎస్టీ. వ‌స్తువు ఉత్ప‌త్తి ద‌శ నుంచి అంతిమ వినియోగం వ‌ర‌కూ అన్ని ద‌శ‌ల్లో దీనిని విధించాల‌ని ప్ర‌తిపాదించారు. మునుప‌టి ద‌శ‌ల‌లో చెల్లించిన ప‌న్నుల‌ను సెటాఫ్గా చూపించ‌డం జ‌రుగుతుంది. అంటే ఇంత‌కు ముందు ద‌శ‌లో చెల్లించిన ప‌న్నును తీసివేసి వ్యాపారులు ప‌న్నును చెల్లించాల్సి ఉంటుంది. క్లుప్తంగా చెప్పాలంటే విలువ జోడింపు పైన మాత్ర‌మే ప‌న్ను విదించ‌డం జరుగుతుంది. అలాగే అంతిమ వినియోగ‌దారుని పైనే ప‌న్ను భారం పడుతుంది.

18 శాతం పరిధిలోకి వచ్చేవి... ఈ పన్ను పరిధిలోకే చాలా వస్తువులను తీసుకొస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకుంది. షుగర్, పాస్తా, కార్న్ ఫ్లేక్స్, రొట్టెలు, కేకులు, జామ్స్, సాసులు, సూప్స్, ఐస్ క్రీమ్, ఇన్ స్టాంట్ ఫుడ్ మిక్సెస్, మినరల్ వాటర్, టిష్యూలు, ఎన్విలాప్స్, టాంపోన్స్, నోట్ బుక్స్, స్టీల్ ప్రొడక్ట్స్, ప్రింటెడ్ సర్క్యూట్స్, కెమెరా, స్పీకర్స్, మానిటర్స్.

 

28 శాతం పన్నుపరిధిలోకి వచ్చేవి… చూయింగ్ గమ్, మొలాసిస్, కోకా లేని చాకోలెట్లు, వాఫెల్స్, పాన్ మసాలా, పేయింట్, ఫర్ ప్యూమ్, షేవింగ్ క్రీమ్స్, హెయిర్ షాంపు, డై, సన్ స్క్రీన్, వాల్ పేపర్, పింగాణి పాత్రలు, వాటర్ హీటర్, డిష్ వాషర్, బరువు కొలిచే యంత్రాలు, వాషింగ్ మిషన్, ఏటీఎంలు, వెండింగ్ మిషన్లు, వాక్యుమ్ క్లీనర్స్, షేవర్స్, హెయిర్ క్లిప్పర్స్, ఆటోమొబైల్స్, మోటార్ సైకిల్స్, వ్యక్తిగత అవసరాలకు వాడే ఎయిర్ క్రాఫ్ట్.
[the_ad id=”128″]

ఇప్ప‌టికే ఇన్ని ప‌న్నులుండ‌గా జీఎస్టీ ఎందుకు? దేశంలో ప‌రోక్ష ప‌న్నుల వ్య‌వ‌స్థ‌లో చాలా గంద‌ర‌గోళం ఉంది. వ్యాట్ వ‌చ్చిన త‌ర్వాత ప‌న్ను వ్య‌వ‌స్థ దారిన ప‌డుతుంద‌ని భావించారు. స్వ‌ల్ప లోపాల వ‌ల్ల అది విజ‌య‌వంతం కాలేదు. దీంతో దేశ‌వ్యాప్తంగా ఏక‌రీతి ప‌న్ను వ్య‌వ‌స్థ జీఎస్టీ ప్ర‌తిప‌దాన వ‌చ్చింది. ఒక‌సారి జీఎస్టీ వ‌స్తే దాదాపుగా ప‌రోక్ష పన్నులేవీ ఉండ‌వు. జీఎస్టీ రాక‌తో ర‌ద్ద‌య్యేవి.

1. కేంద్రం విధిస్తున్న వాటిలో కేంద్ర ఎక్సైజ్ సుంకం ఎక్సైజ్ సుంకాలు(ఔష‌ధాలు, సౌంద‌ర్య సాధ‌నాలు) అద‌న‌పు ఎక్సైజ్ సుంకాలు(ప్ర‌త్యేక ప్రాముఖ్యం క‌లిగిన ఉత్ప‌త్తులు) అద‌న‌పు ఎక్సైజ్ సుంకాలు(జౌళి మ‌రియు జౌళి ఉత్ప‌త్తులు) అద‌న‌పు క‌స్ట‌మ్స్ సుంకాలు(వీటిని సీవీడీగా వ్య‌వ‌హ‌రిస్తుంటారు) ప్ర‌త్యేక అద‌న‌పు క‌స్ట‌మ్స్ సుంకం(ఎస్ఏడీ) సేవా ప‌న్ను (స‌ర్వీస్ ట్యాక్స్) వ‌స్తు,సేవ‌ల‌పై కేంద్ర స‌ర్‌చార్జీలు, సెస్సులు

2. జీఎస్టీ వ‌ల్ల ర‌ద్ద‌య్యే రాష్ట్ర ప్ర‌భుత్వాల ప‌న్నులు విలువ ఆధారిత ప‌న్ను(వ్యాట్‌) రాష్ట్ర సుంకం కేంద్ర అమ్మ‌కం ప‌న్ను(సెంట్ర‌ల్ సేల్స్ ట్యాక్స్‌) విలాస సుంకం(ల‌గ్జ‌రీ ట్యాక్స్‌) ప్ర‌వేశ సుంకం (అన్ని రూపాల్లో) వినోదం, ఉల్లాస‌పు ప‌న్ను(స్థానిక సంస్థ‌లు విధించేది మిన‌హా) ప్ర‌క‌ట‌న‌ల‌పై విధించే పన్ను కొనుగోలు సుంకం లాట‌రీలు, పందేలు, జూదంపై విధించే సుంకం వ‌స్తు సేవ‌ల ప‌న్ను –

 

జీఎస్టీ ప‌రిధి నుంచి మిన‌హాయించిన వ‌స్తువులేవి? ఇటీవ‌ల జీఎస్టీ కౌన్సిల్ కొన్ని వ‌స్తువుల మీద జీఎస్టీ విధించ‌కూడ‌ద‌ని నిర్ణ‌యం తీసుకున్నాయి. తాజా మాంసం, తాజా చికెన్, గుడ్లు, పాలు, పెరుగు, సహజంగా దొరికే తేనె, తాజా కూరగాయలు, పండ్లు, పిండ్లు, ఉప్పు, బ్రెడ్, బిందీ, సిందూర్, స్టాంపు, జ్యుడిషియల్ పేపర్స్, ప్రచురించిన పుస్తకాలు, వార్తాపత్రికలు, గాజులు, చేనేత వస్త్రాలు మొద‌లైన వాటి మీద జీఎస్టీ ఉండ‌దు.

Related posts

Leave a Comment

[the_ad id="128"]